Monday, 27 December, 2010

క్రిస్మస్@సోమర్సెట్ మాల్

క్రిస్మస్...క్రిస్మస్....మా ఊళ్ళో....'సోమర్సెట్ మాల్' లో క్రిస్మస్ కోలాహలం చూస్తారా? ఏంజెల్స్...క్రిస్మస్ ట్రీస్....శాంటా తాత....ఎల్ఫ్..ఇలా ఎన్నో అందమైన వాటితో ఈ మాల్ అలకరించారు.వెలుగులుజిలుగు విరజిమ్ముతూ....మెరిసిపోతున్న మాల్ సౌందర్యం మీరు చూడండీ :)

Thursday, 16 December, 2010

మబ్బుల సోయగం

న్యూయార్క్ వెళుతున్నపుడు..దారిలో...పెన్సిల్వేనియాలో...కనిపించిన అందాలు...కొండలు..మబ్బులు..వాన..ఇక ఈ కింద ఉన్న రంగురంగుల మబ్బుల సోయగం కనెక్టికట్ లో ఉండే మా చందు ఫ్రెండ్ సంపత్ గారి ఇంటి బాల్కని ఎదురు దృశ్యాలు......బాగున్నాయా?      

         
Thursday, 2 December, 2010

మంచు జల్లు

వర్షపు జల్లు విన్నాం కానీ ఈ మంచు జల్లు ఏమిటబ్బ అనుకుంటున్నారా? మరి మా ఊళ్ళో ఇలానే సన్నగా,జల్లులాగ కురుస్తోంది మంచు.ముద్దలుగా కాకుండా ఇలా సన్నని రేకులుగా పడే మంచుని 'ఫ్లర్రీస్'(Flurries) అంటారట.ఫాల్ కి రాలిన ఆకుల్లో కుదురుగా ఒదిగిపోతున్న మంచు రేణువులను చూస్తుంటే భలే ఉంది.తెల్లని పొడిలాగా కురుస్తున్న ఈ మంచుని మీరు చూడండీ.