Wednesday, 26 December, 2012

మంచు పూల వాన

"ఈ మంచుల్లో.... ప్రేమంచుల్లో.... ఎన్నెన్నో సంగతులు...." అని  పాడుకోవాలనిపిస్తుంది ఈ మంచు చూస్తుంటే! ఈసారి డిసెంబరులో అప్పుడప్పుడు స్నో పడుతుంటే.... క్రిస్మస్ కి మంచు పడదేమో అనుకున్నా! లేదు... శాంతా తాత బోలెడు మంచు కురిపించాడు :)

మీరు ఆస్వాదించండి .... మా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల తీసిన ఈ ఫోటోలలో  'మంచుపూలవాన' అందాలు...









Tuesday, 3 July, 2012

సుందర సూర్యోదయాలు

సప్తాశ్వరూఢుడై.....తిమిర సంహారానికి బయలుదేరే....ప్రత్యక్ష నారాయణుడి ప్రచండ కిరణాలు తాకి పుడమి తల్లి మేల్కొనే వేళ...సూర్యోదయం.
సాగర తీరాల్లో,కొండ మాటున,మబ్బుల తెర చాటునించి,చిగురాకుల మధ్యనించి దూసుకువచ్చే రవికిరణాల సోయగం ఏమని చెప్పను?? 
నేను తీసిన కొన్ని సూర్యోదయ దృశ్యాలు....మీకోసం.










Monday, 19 March, 2012

క్యాండిల్స్ + పెబెల్స్ + ఫ్లవర్స్

ఇంట్లో ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటున్న రోజుల్లో తీసిన కుఠోలు....  నాకు సేన్టేడ్ క్యాండిల్స్ అంటే ఇష్టం! అలాగే.... పెబెల్స్  అదే నున్నటి గులకరాళ్ళు.... వీటికి తోడూ..... మనసు దోచే ఫ్లవర్స్.... గులాబి పూలు :) విచిత్రమేంటి అంటే... నాకు నీలి రంగు రోజా దొరికింది :) ఇక చెలరేగిపోయి... రకరకాల కుఠోలు తీసా అన్నమాట :) చూసి మీరు తరించండి ;) 








Thursday, 4 August, 2011

సీతాకోక చిలుకానమ్మా.....

రంగురంగుల  రెక్కలతో.....సుకుమారంగా,వయ్యారంగా తోటంతా కలియతిరుగుతూ సందడి చేసే సీతాకోకచిలుకల దృశ్యహారం మీకోసం :)





















Tuesday, 7 June, 2011

నీలపొగపర్వతములు ;)

పేరేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అదంతే...'స్మోకీ' మౌన్టేయిన్స్ కి నేను పెట్టిన ముద్దుపేరు :)

సరే మరి...స్మోకి మౌంటైన్స్ అందాలు చూడడానికి రెడి ఆ? 


ఇది 'కేడ్స్ కోవ్ లూప్'



అరవిరిసిన అడవి పువ్వు విత్ ఈగ ;)


జలజలా పారే 'పీజియన్ ఫోర్జ్' రివర్! ఇక్కడే....టిచిక్...టిచిక్...ఆడుకున్నది మనం :)


ఇదే..'క్లింగ్ మెన్స్ దొమ్' 


నీలిమేలిముసుగు కప్పుకున్న పర్వతాలు 


మబ్బులగుంపు పర్వత శిఖరాలపై దాడి చేస్తోందేమో!


సూర్యుడికి వీడ్కోలు పలికే వేళ!


కొండలచాటుకి వెళ్ళిపోతున్న సూర్యుడు!


వెళ్ళిపోతూ....ఆకాసంలో కుంకుమజల్లిన సంధ్యాదేవి!


ట్రాం వే....ఒబెర్ గాట్లిన్ బర్గ్!


అడవిలో ఎలుగుబంటి :)


ఒబెర్ గాట్లింబర్గ్ లో సందర్సనకి ఉంచిన ఎలుగుబంటి :(


తిరగబడ్డ ఇల్లు :))))))))


»♥« టైటానిక్ »♥« 


ఫర్బిడెన్ కేవర్న్స్ 


చంద్రమండలం అట....గుహలలో :))


స్వచ్చమైన నీటితో ప్రవహించే.....గుహలో నది :)


లైట్లు పెట్టారు వాళ్ళే....ఐస్క్రీం లా ఉంది కదా :)



ప్రపంచంలోకే పెద్ద 'ఆనిక్స్' గోడ ఇదేనట!


ఇవండీ స్మోకి పర్వతాల పర్యటనలో నా కేమరాకి చిక్కిన అద్భుత దృశ్యాలు :) 'ఎసేలార్' కొన్నందుకు తగిన ఫలితం దక్కింది... 

 ఈ స్మోకిపర్వతాలపర్యటన  గురించి వివరంగా తెలియాలంటే....ఇదిగో....ఈ టపా కి వెళ్ళండి....

Thursday, 2 June, 2011

Tulip Fest @ Holland,MI

Pretty Pinks.....
Ravishing Reds....
Elegant Yellows....
Wonderful Violets....
and moreover a beautiful blend of all these.....

This Tulip fest is almost an eye feast ;)