Tuesday, 7 June 2011

నీలపొగపర్వతములు ;)

పేరేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అదంతే...'స్మోకీ' మౌన్టేయిన్స్ కి నేను పెట్టిన ముద్దుపేరు :)

సరే మరి...స్మోకి మౌంటైన్స్ అందాలు చూడడానికి రెడి ఆ? 


ఇది 'కేడ్స్ కోవ్ లూప్'



అరవిరిసిన అడవి పువ్వు విత్ ఈగ ;)


జలజలా పారే 'పీజియన్ ఫోర్జ్' రివర్! ఇక్కడే....టిచిక్...టిచిక్...ఆడుకున్నది మనం :)


ఇదే..'క్లింగ్ మెన్స్ దొమ్' 


నీలిమేలిముసుగు కప్పుకున్న పర్వతాలు 


మబ్బులగుంపు పర్వత శిఖరాలపై దాడి చేస్తోందేమో!


సూర్యుడికి వీడ్కోలు పలికే వేళ!


కొండలచాటుకి వెళ్ళిపోతున్న సూర్యుడు!


వెళ్ళిపోతూ....ఆకాసంలో కుంకుమజల్లిన సంధ్యాదేవి!


ట్రాం వే....ఒబెర్ గాట్లిన్ బర్గ్!


అడవిలో ఎలుగుబంటి :)


ఒబెర్ గాట్లింబర్గ్ లో సందర్సనకి ఉంచిన ఎలుగుబంటి :(


తిరగబడ్డ ఇల్లు :))))))))


»♥« టైటానిక్ »♥« 


ఫర్బిడెన్ కేవర్న్స్ 


చంద్రమండలం అట....గుహలలో :))


స్వచ్చమైన నీటితో ప్రవహించే.....గుహలో నది :)


లైట్లు పెట్టారు వాళ్ళే....ఐస్క్రీం లా ఉంది కదా :)



ప్రపంచంలోకే పెద్ద 'ఆనిక్స్' గోడ ఇదేనట!


ఇవండీ స్మోకి పర్వతాల పర్యటనలో నా కేమరాకి చిక్కిన అద్భుత దృశ్యాలు :) 'ఎసేలార్' కొన్నందుకు తగిన ఫలితం దక్కింది... 

 ఈ స్మోకిపర్వతాలపర్యటన  గురించి వివరంగా తెలియాలంటే....ఇదిగో....ఈ టపా కి వెళ్ళండి....

Thursday, 2 June 2011

Tulip Fest @ Holland,MI

Pretty Pinks.....
Ravishing Reds....
Elegant Yellows....
Wonderful Violets....
and moreover a beautiful blend of all these.....

This Tulip fest is almost an eye feast ;)






Wednesday, 11 May 2011

ఫ్లవర్స్....ఫ్లవర్స్....

మా ఇంట్లో ఫ్లవర్ వాస్ కోసం తీసుకొచ్చిన పువ్వులు ఇవి. భలే ఉన్నాయని ఊరికే అలా క్లిక్కు మనిపించా! :) ఎలా ఉన్నాయ్???








Tuesday, 15 February 2011

జలజలలు...గలగలలు....

జలజలా పారే సెలయేటి గలగలల సరిగమలు......ఉవ్వెత్తున ఎగసి పడి.......సుడులు తిరిగి.....అలల నురగలు ఎగజిమ్మి......జలపాతమై నేలను తాకి మైమర్చిపోయే వేళ........కమ్ముకువచ్చిన ఆ తుషారాలను దోసిళ్ళతో అందుకుని ముద్దాడు వేళ.....మనసంతా ఆనంద తరంగమై ఉప్పొంగు వేళ.....ఇదిగో....జలపాతాల తరంగ విన్యాసం.






Monday, 27 December 2010

క్రిస్మస్@సోమర్సెట్ మాల్

క్రిస్మస్...క్రిస్మస్....మా ఊళ్ళో....'సోమర్సెట్ మాల్' లో క్రిస్మస్ కోలాహలం చూస్తారా? ఏంజెల్స్...క్రిస్మస్ ట్రీస్....శాంటా తాత....ఎల్ఫ్..ఇలా ఎన్నో అందమైన వాటితో ఈ మాల్ అలకరించారు.వెలుగులుజిలుగు విరజిమ్ముతూ....మెరిసిపోతున్న మాల్ సౌందర్యం మీరు చూడండీ :)









Thursday, 16 December 2010

మబ్బుల సోయగం

న్యూయార్క్ వెళుతున్నపుడు..దారిలో...పెన్సిల్వేనియాలో...కనిపించిన అందాలు...కొండలు..మబ్బులు..వాన..ఇక ఈ కింద ఉన్న రంగురంగుల మబ్బుల సోయగం కనెక్టికట్ లో ఉండే మా చందు ఫ్రెండ్ సంపత్ గారి ఇంటి బాల్కని ఎదురు దృశ్యాలు......బాగున్నాయా?







      

         




Thursday, 2 December 2010

మంచు జల్లు

వర్షపు జల్లు విన్నాం కానీ ఈ మంచు జల్లు ఏమిటబ్బ అనుకుంటున్నారా? మరి మా ఊళ్ళో ఇలానే సన్నగా,జల్లులాగ కురుస్తోంది మంచు.ముద్దలుగా కాకుండా ఇలా సన్నని రేకులుగా పడే మంచుని 'ఫ్లర్రీస్'(Flurries) అంటారట.ఫాల్ కి రాలిన ఆకుల్లో కుదురుగా ఒదిగిపోతున్న మంచు రేణువులను చూస్తుంటే భలే ఉంది.తెల్లని పొడిలాగా కురుస్తున్న ఈ మంచుని మీరు చూడండీ.