Wednesday, 26 December 2012

మంచు పూల వాన

"ఈ మంచుల్లో.... ప్రేమంచుల్లో.... ఎన్నెన్నో సంగతులు...." అని  పాడుకోవాలనిపిస్తుంది ఈ మంచు చూస్తుంటే! ఈసారి డిసెంబరులో అప్పుడప్పుడు స్నో పడుతుంటే.... క్రిస్మస్ కి మంచు పడదేమో అనుకున్నా! లేదు... శాంతా తాత బోలెడు మంచు కురిపించాడు :)

మీరు ఆస్వాదించండి .... మా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల తీసిన ఈ ఫోటోలలో  'మంచుపూలవాన' అందాలు...









Tuesday, 3 July 2012

సుందర సూర్యోదయాలు

సప్తాశ్వరూఢుడై.....తిమిర సంహారానికి బయలుదేరే....ప్రత్యక్ష నారాయణుడి ప్రచండ కిరణాలు తాకి పుడమి తల్లి మేల్కొనే వేళ...సూర్యోదయం.
సాగర తీరాల్లో,కొండ మాటున,మబ్బుల తెర చాటునించి,చిగురాకుల మధ్యనించి దూసుకువచ్చే రవికిరణాల సోయగం ఏమని చెప్పను?? 
నేను తీసిన కొన్ని సూర్యోదయ దృశ్యాలు....మీకోసం.










Monday, 19 March 2012

క్యాండిల్స్ + పెబెల్స్ + ఫ్లవర్స్

ఇంట్లో ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటున్న రోజుల్లో తీసిన కుఠోలు....  నాకు సేన్టేడ్ క్యాండిల్స్ అంటే ఇష్టం! అలాగే.... పెబెల్స్  అదే నున్నటి గులకరాళ్ళు.... వీటికి తోడూ..... మనసు దోచే ఫ్లవర్స్.... గులాబి పూలు :) విచిత్రమేంటి అంటే... నాకు నీలి రంగు రోజా దొరికింది :) ఇక చెలరేగిపోయి... రకరకాల కుఠోలు తీసా అన్నమాట :) చూసి మీరు తరించండి ;)