Thursday 21 October, 2010

రాలిన ఆకుల్లో...ఎన్నెన్ని వర్ణాలో...

ఫాల్..ఆకురాలు కాలం...శిశిరానికి  స్వాగతం  పలుకుతూ...చెట్లు చివరిసారిగా  హోలీ ఆడుకుని.....ఆడుకుని...అలసి సొలసి...మెల్లగా ఒక్కొక్క ఆకు జారవిడుస్తున్న వేళ......కొద్దిరోజుల్లో మోడువారబోయే చెట్లను తలిచి బాధపడాలో...అంతటి బాధలోనూ తమ సోయగం తో ప్రకృతికి వన్నెలు దిద్దుతున్నందుకు ఆనందపడాలో....ఏమో...రాలిన ఆకుల్లో ఎన్నెన్ని వర్ణాలో.....ఎన్నెన్ని అందాలో...
















Friday 15 October, 2010

సంధ్యా రాగం...

సాయంసంధ్య వేళ.....సూరీడు ప్రేమ తో చల్లిన రంగులని  అద్దుకుని ఆకాశం...సరస్సు అనే అద్దం లో  తన అందాన్ని చూసుకుంటోంది....





Monday 4 October, 2010

అండమాన్ దీవుల అందాలు..

అండమాన్ దీవులు....బంగాళాఖాతం లో ఉండే అందమైన ద్వీప సమూహం ఇది.చాలా వరకు ఈ దీవులలో ఎవరూ ఉండరు(ఆదిమ జాతి వారు తప్ప).రాజధాని అయిన  'పోర్ట్ బ్లైర్' ఇంకా కొన్ని దీవులు మాత్రమే నివాస యోగ్యం.మిగితవాన్ని దట్టమైన అడవులతో ఉంటాయి.మన దేశం నించి విమానం/ఓడ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.ఎంతో అందమైన ఈ దీవులను చాలా మంది చులకనగా 'అండమాన్ జైలు' అని మాత్రమే అనుకుంటారు...కానీ పంచదార వంటి తెల్లటి ఇసుకతో,కొబ్బరి చెట్లతో,పగడపు దీవుల తో,అందమైన బీచ్ లతో అండమాన్ సుందర ద్వీపంగా అలరారుతోంది...మీరు చూడండి అండమాన్ సొబగులు...