Monday 27 December, 2010

క్రిస్మస్@సోమర్సెట్ మాల్

క్రిస్మస్...క్రిస్మస్....మా ఊళ్ళో....'సోమర్సెట్ మాల్' లో క్రిస్మస్ కోలాహలం చూస్తారా? ఏంజెల్స్...క్రిస్మస్ ట్రీస్....శాంటా తాత....ఎల్ఫ్..ఇలా ఎన్నో అందమైన వాటితో ఈ మాల్ అలకరించారు.వెలుగులుజిలుగు విరజిమ్ముతూ....మెరిసిపోతున్న మాల్ సౌందర్యం మీరు చూడండీ :)









Thursday 16 December, 2010

మబ్బుల సోయగం

న్యూయార్క్ వెళుతున్నపుడు..దారిలో...పెన్సిల్వేనియాలో...కనిపించిన అందాలు...కొండలు..మబ్బులు..వాన..ఇక ఈ కింద ఉన్న రంగురంగుల మబ్బుల సోయగం కనెక్టికట్ లో ఉండే మా చందు ఫ్రెండ్ సంపత్ గారి ఇంటి బాల్కని ఎదురు దృశ్యాలు......బాగున్నాయా?







      

         




Thursday 2 December, 2010

మంచు జల్లు

వర్షపు జల్లు విన్నాం కానీ ఈ మంచు జల్లు ఏమిటబ్బ అనుకుంటున్నారా? మరి మా ఊళ్ళో ఇలానే సన్నగా,జల్లులాగ కురుస్తోంది మంచు.ముద్దలుగా కాకుండా ఇలా సన్నని రేకులుగా పడే మంచుని 'ఫ్లర్రీస్'(Flurries) అంటారట.ఫాల్ కి రాలిన ఆకుల్లో కుదురుగా ఒదిగిపోతున్న మంచు రేణువులను చూస్తుంటే భలే ఉంది.తెల్లని పొడిలాగా కురుస్తున్న ఈ మంచుని మీరు చూడండీ.











Tuesday 16 November, 2010

పుష్ప విలాసం

'సుమం ప్రతి సుమం సుమం....వనం ప్రతి వనం వనం'
ఈపాట లాగే....పూవులు కూడా ఎంతో అందంగా ఉంటాయి కదా!.ప్రక్రుతి అందం పువ్వులో...వాటి నవ్వులో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
ఎన్నో రంగులు...ఎన్నో రూపులు...ఎన్నో సుగంధాలు....కానీ అవి పంచే ఆహ్లాదం మాత్రం అద్భుతం.....
అందమైన ఆ పూవుల సోయగాల్లో కొన్ని ఇక్కడ చూడండీ మరి.....










చివరి ఫోటో మా కిట్టుగాడిది. వాడికి నాలాగే రొసేస్ ఇష్టం.అందుకే ఒకరోజు ఆఫీస్ నించి వస్తూ రెండు రోజ్ ఫ్లవర్స్ తెచ్చా.అవి కిట్టుకి భలే నచ్చాయి.ఫోటో తీయమని ఒకటే గోల.సరే అని తీసేసా! అదన్నమాట సంగతి :)




Thursday 21 October, 2010

రాలిన ఆకుల్లో...ఎన్నెన్ని వర్ణాలో...

ఫాల్..ఆకురాలు కాలం...శిశిరానికి  స్వాగతం  పలుకుతూ...చెట్లు చివరిసారిగా  హోలీ ఆడుకుని.....ఆడుకుని...అలసి సొలసి...మెల్లగా ఒక్కొక్క ఆకు జారవిడుస్తున్న వేళ......కొద్దిరోజుల్లో మోడువారబోయే చెట్లను తలిచి బాధపడాలో...అంతటి బాధలోనూ తమ సోయగం తో ప్రకృతికి వన్నెలు దిద్దుతున్నందుకు ఆనందపడాలో....ఏమో...రాలిన ఆకుల్లో ఎన్నెన్ని వర్ణాలో.....ఎన్నెన్ని అందాలో...
















Friday 15 October, 2010

సంధ్యా రాగం...

సాయంసంధ్య వేళ.....సూరీడు ప్రేమ తో చల్లిన రంగులని  అద్దుకుని ఆకాశం...సరస్సు అనే అద్దం లో  తన అందాన్ని చూసుకుంటోంది....





Monday 4 October, 2010

అండమాన్ దీవుల అందాలు..

అండమాన్ దీవులు....బంగాళాఖాతం లో ఉండే అందమైన ద్వీప సమూహం ఇది.చాలా వరకు ఈ దీవులలో ఎవరూ ఉండరు(ఆదిమ జాతి వారు తప్ప).రాజధాని అయిన  'పోర్ట్ బ్లైర్' ఇంకా కొన్ని దీవులు మాత్రమే నివాస యోగ్యం.మిగితవాన్ని దట్టమైన అడవులతో ఉంటాయి.మన దేశం నించి విమానం/ఓడ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.ఎంతో అందమైన ఈ దీవులను చాలా మంది చులకనగా 'అండమాన్ జైలు' అని మాత్రమే అనుకుంటారు...కానీ పంచదార వంటి తెల్లటి ఇసుకతో,కొబ్బరి చెట్లతో,పగడపు దీవుల తో,అందమైన బీచ్ లతో అండమాన్ సుందర ద్వీపంగా అలరారుతోంది...మీరు చూడండి అండమాన్ సొబగులు...